‘కూలీ’ మేకర్స్ డేరింగ్ స్టెప్ ఎంతవరకు నిజం?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ సినిమానే ‘కూలీ’ ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న పాన్ ఇండియా లెవెల్ సాలిడ్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఆల్రెడీ పాటలు, ఇతర అప్డేట్స్ మంచి హైప్ ఇస్తున్నాయి.

ఇక ఇవి కాకుండా లోకేష్ కనగరాజ్ మార్క్ ట్రైలర్ కట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి రజినీని పరిచయం చేస్తూ తన గత సినిమాల హీరోస్ లానే ఇచ్చాడు కానీ కనీసం టీజర్ లాంటి దాన్ని కూడా వదల్లేదు. మరి ఒక ఊహించని బజ్ కూలీ పై వినిపిస్తోంది.

దీని ప్రకారం అసలు ఇక సినిమాపై టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏవి లేకుండానే నేరుగా థియేటర్స్ లోకి సినిమా వస్తుంది అన్నట్టుగా కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే ఇదొక డేరింగ్ స్టెప్ అనే అనుకోవాలి కానీ ఆడియెన్స్ ని మాత్రం ఖచ్చితంగా డిజప్పాయింట్ చేసినవారే అవుతారు. ప్రస్తుతానికి అయితే ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదనే అనుకోవాలి. సో దీనిపై ఇంకొంచెం సమయం వేచి చూస్తే సరిపోతుంది.

Exit mobile version