ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ విషయంలో కొత్త వివాదం తలెత్తింది. కర్ణాటకకి చెందిన ఓ జైన మతం వాళ్ళు తమ మతానికి ఇబ్బంది కలిగించేలా ఉందని కేసు పెట్టినట్టు అంటున్నారు. జైనులకు బాహుబలి అనే వ్యక్తి చాలా దేవుడితో సమానం. అతనికి పూజలు చేస్తారు. అలాంటిది ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్న ఈ సినిమాకి తమ బాహుబలి టైటిల్ పెట్టి అవమానిస్తున్నారని వారు కంప్లైంట్ చేసారు.
కానీ ఈ వార్తలని ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ కొట్టిపారేశాడు. అలాగే బాహుబలి సినిమా బాహుబలి అనే అతని నిజమైన కథ అని అన్నారు. ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడిన శోభు ‘నా వరకూ ఇంకా అలాంటి కంప్లైంట్ రాలేదు. ఈ సినిమా గోమాతేశ్వర గా పేరుపొందిన జైన్ గురు బాహుబలిది కాదని’ అన్నాడు.
ప్రస్తుతం బాహుబలి కోసం ఓ భారీ వార్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.