తండ్రినే అభిమానిగా మార్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్

తండ్రినే అభిమానిగా మార్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్

Published on Jun 16, 2013 1:00 PM IST

Keeravani
కెరీర్లో ఒక మనిషి ఎంత అత్యున్నత స్థానాలకి చేరుకోవాలన్న వారి తల్లి తండ్రుల ప్రోత్సాహమే ముఖ్యమైనది. ముఖ్యంగా ఫాదర్ సపోర్ట్. అలాంటి ఫాదర్స్ అందరికీ అభినందనలు తెలుపుకునే ఫాదర్స్ డే ఈ రోజు. పిల్లల కోసం కష్టపడే ఫాదర్ కి తన కొడుకు గొప్పవాడైతే ఆనందం ఎక్కువ అవుతుంది, అదే ఆ తండ్రే కొడుక్కి అభిమానిగా మారే స్థాయికి వెళితే ఆ తండ్రికి అంతకన్నా కావాల్సింది ఏముంది. ఇదే భావనని టాలీవుడ్ ప్రేక్షకులని తన సంగీతంతో మెప్పించి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటల్ని అందించిన ఎం.ఎం కీరవాణి వారు గారు వారి తండ్రి అయిన శివశక్తిదత్తా గారికి కలిగించారు.

ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన కొడుకు గురించి చెబుతూ ‘ కీరవాణి రెండున్నరేళ్ళ వయస్సులోనే గ్లాసులో నెలలు పోసి జలతరంగిణి వాయించేవాడు. కానీ రెండేళ్ళ వరకూ కీరవాణి మాట్లాడలేదు, నేను మూగవాడేమోనని తెగ కంగారు పడిపోయాను. అలాంటి వాడు ఉన్నట్టుండి గ్రాంధికం మొదలు పెట్టాడు. శ్లోకాలను అలవోకగా చెప్పేవాడు. నా ముగ్గురు కొడుకుల్లో కీరవాణి ఎక్స్ ట్రార్డినరీ చిల్డ్రన్. ఒక కళాకారుడిగా కీరవాణి ప్రతిభకి అభిమానినై పోయానని’ అన్నాడు. అలాగే నాకొడుకు సంగీతం అందిచిన అన్ని పాటల్లో నాకు ‘అల్లుడుగారు’ సినిమాలోని ‘మరుగేల.. మబ్బు ముసుగేల’ అనే పాటంటే చాలా ఇష్టం.

తాజా వార్తలు