పైరసీ సైట్ నిర్వాహకుడి అరెస్ట్ కి కారణం ఆమె !

పైరసీ సైట్ నిర్వాహకుడి అరెస్ట్ కి కారణం ఆమె !

Published on Nov 16, 2025 10:06 AM IST

సినీ పరిశ్రమను పైరసీ మాఫియా ఐబొమ్మ కొన్ని సంవత్సరాలుగా వణికిస్తూనే ఉంది. ఐతే, పైరసీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వెబ్‌సైట్ ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మడి రవిని హైదరాబాదులో అరెస్ట్ చేసారు. రవి విదేశాల్లో ఉంటూ ఈ పైరసీ సైట్ ను నిర్వహిస్తున్నాడని టాక్. ఐబొమ్మ లాంటి సైట్ వల్ల ఓటీటీ, థియేటర్లకు భారీ నష్టం చేకూరుతోందని, పైరసీ మాఫియాను అరికట్టాలని పలువురు నిర్మాతలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రవి పై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఐతే, ఇమ్మడి రవిని పట్టుకునే ప్రక్రియలో అతడి భార్య కీలక పాత్ర పోషించారట. గత కొంతకాలంగా రవికి భార్యతో విభేదాలు నెలకొన్నాయి. అందుకే, రవి భార్య సైబర్ క్రైమ్ అధికారులకు గోప్యంగా రవి గురించి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రవి అరెస్ట్‌తో పాటు అతడు ఉపయోగించిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, నెట్‌వర్క్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ పైరసీ సైట్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో చూడాలి.

తాజా వార్తలు