అక్కినేని నాగార్జున కెరీర్‌లో కల్ట్ చిత్రంగా నిలిచింది ‘శివ’. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాతో ఇండియాని షేక్ చేశాడు. అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో నాగార్జున స్టార్‌డమ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా గురించి గత కొన్నేళ్లుగా ఒకే ప్రశ్న వినిపిస్తోంది. శివ రీ-రిలీజ్ ఎప్పుడు..?
అయితే, తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు నాగార్జున. శివ లాంటి క్లాసిక్ కల్ట్ చిత్రం త్వరలోనే రీ-రిలీజ్ అవుతుందని ఆయన తెలిపాడు. ఇక ఈ చిత్రాన్ని 4K డాల్బీ అట్మోస్‌తో రీ-రిలీజ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించాడు. అయితే, ఈ చిత్ర రీ-రిలీజ్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’తో పాటు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు నాగ్ తెలిపాడు.
‘కూలీ’లో సైమన్ అనే పాత్రలో నాగ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో కూలీ చిత్రాన్ని వీక్షించే అభిమానులకు శివ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. మరి ఈ కల్ట్ చిత్రం రీ-రిలీజ్ ఎప్పుడు ఉంటుందో.. ఈ ట్రైలర్ కట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి