‘గమనం’ నుండి మరో ఇంట్రస్టింగ్ లుక్ !

‘గమనం’ నుండి మరో ఇంట్రస్టింగ్ లుక్ !

Published on Oct 5, 2020 9:55 AM IST

ప్రముఖ నటి శ్రియ ప్రాధాన పాత్రలో నటిస్తున్న సినిమా ’గమనం.‘ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాగా ’గమనం‘ రానుంది. శ్రియ, నిత్యా మీనన్ తో పాటు ఇంకా ఈ సినిమాలో ప్రియాంకా జ‌వాల్క‌ర్, శివ కందుకూరి తదితరులు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. కాగా తాజాగా ప్రియాంకా జ‌వాల్క‌ర్, శివ కందుకూరికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో శివ జెర్సీ ధరించిన క్రీడాకారిణిగా కనిపిస్తుండగా, ప్రియాంక సాంప్రదాయ దుస్తులలో ఒక సాధారణ ముస్లిం అమ్మాయిగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మరో ప్రముఖ నటి నిత్యామీనన్ క్లాసికల్ సింగర్ శైలపుత్రీ దేవి పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు సినిమాకు సుజనారావు దర్శకత్వం వహిస్తుండగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలను అందిస్తున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌ గా చేస్తూనే , ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జరుపుకుంటోంది.

తాజా వార్తలు