జూలైలో విడుదల కాబోతున్న శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’

జూలైలో విడుదల కాబోతున్న శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’

Published on May 22, 2012 11:50 AM IST


శేఖర్ కమ్ముల కొత్త చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ జూలై నెలలో విడుదలకు సిద్ధమవుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మొదటగా ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావించినప్పటికీ ఈ సినిమాలో నటిస్తున్న ఒక కొత్త అమ్మాయి వివాదం వాళ్ళ వాయిదా పడటం ఆమె స్థానంలో శ్రియని పెట్టి మళ్లీ షూట్ చేయడంతో ఆలస్యమయింది. ప్రస్తుత యువత మనోభావాల పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా కొత్త వారితో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు