యంగ్ హీరో శర్వానంద్ చేస్తున్న చిత్రాల్లో ‘శ్రీకారం’ కూడ ఒకటి. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో లాక్ డౌన్ రావడంతో సినిమాకు బ్రేక్ పడింది. ఇటీవలే ఈ లాక్ డౌన్ ముగియడంతో ఆగిపోయిన తన సినిమాలను రీస్టార్ట్ చేస్తున్నారు శర్వా. కొద్దిరోజుల క్రితమే తన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని తిరిగి మొదలుపెట్టిన ఆయన ఈరోజు నుండి ‘శ్రీకారం’ షూటింగ్ కూడ స్టార్ట్ చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని తిరుపతి పరిసరాల్లోని పచ్చని పంట పోలాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు టీమ్.
ఈ నెలాఖరు నాటికి బ్యాలెన్స్ షూట్ పూర్తవుతుందట. ఈ చిత్రం ఆధునిక వ్యవ్యసాయ పద్దతులు అనే కాన్సెప్ట్ మీద ఉండనుంది. డెబ్యూ దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. టైటిల్ విన్న ప్రేక్షకులు శర్వా గత చిత్రాల్లో ఒకటైన ‘శతమానంభవతి’ తరహాలో ఈ సినిమా కూడ మంచి ఫ్యామిలీ ఎంటెర్టైనర్ అవుతుందని భావిస్తున్నారు. కొన్నాళ్ళుగా వరుస పరాజయాలు చవిచూసిన శర్వా సైతం ఈ ప్రాజెక్ట్ మీద గట్టిగా హోప్స్ పెట్టుకుని ఉన్నాడు. మీక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయకిగా నటిస్తోంది.