కొన్నిరోజుల క్రితం ప్రారంభమైన శర్వానంద్, నిత్యా మీనన్ ల సినిమా ప్రస్తుతం వైజాగ్ లో చిత్రీకరణజరుపుకోనుంది. క్రాంతి మాధవ్ దర్శకుడు. వల్లభ నిర్మాత. కె.ఎస్ రామారావు సమర్పకుడు
ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తిచేసుకుంది. ఇప్పుడు ఈ నెల రెండో వారంలో కొత్త షెడ్యూల్ ను వైజాగ్ లో జరుపుకోనుంది. శర్వా క్రీడాకారుడిగా, నిత్యా ధనవంతుల కూతురిగా కనిపించనున్నారు. ఈ స్క్రిప్ట్ మన హీరోకి చాలా నచ్చేసిందట. తెలుగులో ఇలాంటి స్క్రిప్ట్ లు చాలా అరుదని అందుకే విన్నవెంటనే అంగీకరించినట్లు తెలిపాడు
గోపి సుందర్ సంగీతదర్శకుడు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్. ఆగష్టులో ఈ సినిమా విడుదలకానుంది