శర్వానంద్ మాస్ సంభవం.. సంపత్ నందితో పాన్ ఇండియా ‘భోగి’

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కూడా ఒకరు. మరి తాను హీరోగా దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో ఓ సాలిడ్ మాస్ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ని అందించారు. దీనితో ఒక ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని మేకర్స్ రివీల్ చేస్తూ శర్వానంద్ నుంచి కంప్లీట్ మాస్ షేడ్ ను ప్రెజెంట్ చేసారని చెప్పాలి. అలాగే దర్శకుడు సంపత్ నంది చూపించిన మాస్ కట్స్ మాత్రం అదిరాయని చెప్పాలి.

ఇక వీటితో పాటుగా ఈ చిత్రానికి “భోగి” అనే టైటిల్ ని మేకర్స్ రివీల్ చేయడం జరిగింది. నేటి నుంచే షూటింగ్ ని స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం విడుదలని మేకర్స్ పాన్ ఇండియా భాషల్లో కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతిలు హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ బయటకి రానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version