సూపర్బ్ విసువల్ ఎఫెక్ట్స్ తో రానున్న శంకర్ సినిమా

సూపర్బ్ విసువల్ ఎఫెక్ట్స్ తో రానున్న శంకర్ సినిమా

Published on Jul 16, 2013 3:35 PM IST

Manoharudu working stills (1)

డైరెక్టర్ శంకర్ తను తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త విషయన్ని చూపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం తను హీరో విక్రమ్ తో కలిసి ‘ఐ’ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు టైటిల్ ‘మనోహరుడు’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికె 75% శాతం ముగిసింది. ఈ సినిమాకి మంచి ఔట్ పుట్ వచ్చిందని శంకర్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమాని సూపర్బ్ విసువల్ ఎఫెక్ట్స్ తో నిర్మిస్తున్నారని సమాచారం. దీనిపై శంకర్ ఒక షాకింగ్ న్యూస్ ని తెలియజేశాడు. ఈ సినిమా విసువల్ ఎఫెక్ట్స్ ని న్యూజిలాండ్ లోని వెట స్టూడియోలో నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎ.ఆర్ రహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి పి.సీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు