సౌత్ ఇండియన్ అగ్ర దర్శకుడు శంకర్ తీయబోయే తదుపరి “ఐ” చిత్రం చిత్రీకరణ ఈ రోజు ఉదయం చెన్నైలో లాంచనంగా ప్రారంభమైంది. వికారం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ ఒక కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ రెండు విభిన్న పాత్రలు చేయనున్నారని కోలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఈచిత్రం మొదటి అర్ధ భాగంలో విక్రమ్ చాలా స్లిమ్ గా కనిపించనున్నారని మరియు రెండవ అర్ధ భాగంలో బాగా కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నారని సమాచారం. తన బాడీలో చిత్రానికి తగిన మార్పులు తెచ్చుకోవడానికి శంకర్ విక్రమ్ కి మూడు నెలల సమయం ఇచ్చారని సమాచారం.
ఇది అమీ జాక్సన్ కెరీర్లోనే భారీ చిత్రం ” ఇప్పుడే ‘ఐ’ చిత్ర పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి, షూటింగ్ మొదలవుతోంది. శంకర్ గారి దర్శకత్వంలో నటించడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను మరియు విక్రమ్ సరసన నటించడం చాలా ఆనందంగా ఉంది” అని అమీ జాక్సన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిసున్నారు. ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు.