మొత్తం మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ దర్శకుల లిస్ట్ లో తమిళ్ ఇండస్ట్రీ దర్శకుడు శంకర్ పేరు ఎప్పుడో చేర్చబడింది. శంకర్ సినిమా అంటే ఒక విజువల్ ట్రీట్ అనే మాటతో పాటుగా ఒక మెసేజ్ కూడా ఉంటుందని ఫిల్మీ లవర్స్ కు బాగా గుర్తుండిపోయింది. అందుకే శంకర్ ను ఇండియన్ జేమ్స్ కేమరూన్ గా పిలుస్తారు. అయితే ఇప్పుడు శంకర్ కు మాత్రం టైం ఏమంత బాగోలేదనే చెప్పాలి.
ఎంతో స్ట్రాంగ్ కంటెంట్ తో ఉండే శంకర్ చిత్రాలు ఇప్పటికీ అలానే వస్తున్నాయి కానీ ఈ దర్శకుడు మాత్రం ఇప్పుడు సీక్వెల్స్ బాట పట్టారు. చియాన్ విక్రమ్ తో తీసిన “ఐ” వరకు మధ్యలో తలపతి విజయ్ తీసిన “స్నేహితుడు” మినహాయిస్తే అన్ని సరికొత్త కథతో కూడిన స్ట్రెయిట్ సినిమాలే. ఓ రకంగా శంకర్ ను మన దేశంలోనే టాప్ డైరెక్టర్ నిలపడానికి అవే ఎంతగానో దోహద పడ్డాయి. ప్రతీ సినిమా కూడా ఒక సెన్సేషనల్ హిట్ కావడంతో ఆ సమయంలోనే ఎన్నో రికార్డులు సెట్ చేసాడు శంకర్.
అయితే ఇక అలా కాలం మారుతున్న కొద్దీ శంకర్ కెరీర్ లో భారీ హిట్ అయినటువంటి “రోబో” కు సీక్వెల్ అనౌన్స్ చెయ్యడంతో మరోమారు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ చిత్రంలో కంటెంట్ రోబోతో పోలిస్తే జస్ట్ ఓకే అనిపించడంతో అంచనాలు రీచ్ కాలేకపోయింది. ఇక దాని తర్వాత శంకర్ కెరీర్ లో మరో బెంచ్ మార్క్ చిత్రం విశ్వనటుడు కమల్ తో తీసిన “భారతీయుడు”కు సీక్వెల్ ను ప్రకటించారు.
దానిపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఓకె అంతా బాగుంది కానీ ఇపుడు మరో చిత్రం “జెంటిల్ మెన్” కు కూడా సీక్వెల్ ఉండనుంది అని నిర్ధారణ అయ్యింది. ఇక దీనితో శంకర్ నుంచి ఇలా సీక్వెల్స్ వస్తే ఫిల్మీ లవర్స్ వింటేజ్ శంకర్ ను మిస్సయ్యే ఛాన్స్ ఉంది. మధ్యలో కొత్త కథలతో కూడా వస్తేనే బాగుంటుంది అనే భావన కూడా తప్పకుండా కలగొచ్చు.
పైగా 2.0, రోబోతో కంపేర్ చేస్తే అంత స్ట్రాంగ్ గా కూడా నిలవకపోవడంతో శంకర్ కొనసాగిస్తున్న ఈ సీక్వెల్స్ పరంపర ఎంత వరకు సక్సెస్ అవుతుంది అన్నది ఇప్పుడు తీయనున్న “భారతీయుడు 2” మీదనే ఆధారపడి ఉంది. 2.0 లా కాకుండా ఈ చిత్రానికి భారతీయుడు ని మించిన స్ట్రాంగ్ కంటెంట్ అండ్ మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో వస్తే అప్పుడు జెంటిల్ మెన్ సీక్వెల్ పై కూడా ఖచ్చితంగా నమ్మకం కుదురుతుంది, ఒకవేళ ఇంకా సీక్వెల్స్ ప్లాన్ చేసినా మినిమమ్ అంచనాలు పెచుకోవచ్చు. సో శంకర్ సీక్వెల్స్ మంత్రా ఖచ్చితంగా “భారతీయుడు 2” మీదనే ఆధార పడి ఉందని చెప్పాలి.