అక్టోబర్ మొదటి వారంలో ‘షాడో’ టీజర్


విక్టరీ వెంకటేష్ స్టైలిష్ లుక్ తో, డాన్ పాత్రలో కనిపించనున్న చిత్రం ‘షాడో’. ఈ చిత్రం యొక్క ఫస్ట్ టీజర్ ని అక్టోబర్ 1న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర కథా రచయిత అయిన కోనా వెంకట్ దృవీకరించారు. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ముద్దుగుమ్మ తాప్సీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ మరియు మధురిమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పరుచూరి కిరీటి భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రపంచంలోని పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

Exit mobile version