మరోసారి వాయిదా పడ్డ షాడో రిలీజ్

మరోసారి వాయిదా పడ్డ షాడో రిలీజ్

Published on Apr 8, 2013 12:45 PM IST

Shadow
విక్టరీ వెంకటేష్ స్టైలిష్ అండ్ మాస్ లుక్ తో తెరకెక్కిన ‘షాడో’ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. అనుకున్న దాని ప్రకారం ఈ సినిమాని ఏప్రిల్ 11న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈ సినిమాని ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వెంకటేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి మెహెర్ రమేష్ డైరెక్టర్. ఢిల్లీ బ్యూటీ తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమాకి కోనా వెంకట్ – గోపి మోహన్ లు స్క్రిప్ట్ ని అందించారు. ఈ స్టైలిష్ రివెంజ్ డ్రామా సినిమాకి ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు