సినిమాల విడుదల లేక కరువులో వున్న తెలుగు చిత్రసీమ

సినిమాల విడుదల లేక కరువులో వున్న తెలుగు చిత్రసీమ

Published on Aug 10, 2013 3:47 PM IST

TFI

తెలుగు సినీ సీమ ప్రస్తుతం తెలుగు సినిమాల విడుదలలేక కరువులో బతుకుతుంది. నిన్న విడుదలైన రెండు సినిమాలు (‘అన్న’, ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’) అంతగా ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి. నిజానికి ఈ సినిమాల కారణంగా ‘సాహసం’, ‘రొమాన్స్’ వంటి పాత సినిమాలకు తిరిగి గిరాకీ లభించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో షారుక్ నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమా భారీ వసూళ్ళను రాబట్టుకుంటుంది

నెల్లూరు వంటి ఏరియాలలో ఈ కరువుకారణంగా సూర్య నటించిన ‘సింగం’ సినిమాకు అనుకోకుండా కలెక్షన్లు పెరిగాయి. “ప్రేక్షకులు సినిమాలు లేక కరువులోవున్నారు. మంచి చిత్రాలకోసం ఎదురుచూస్తున్నారు. మనకు సరైన సినిమాలు విడుదలవ్వడం లేదు గనుకే మూడు, నాలుగు వారాలు ఆడిన సినిమాలకు ఇప్పుడు అనుకోకుండా కలెక్షన్లు వస్తున్నాయ”ని తూర్పుగోదావరికి చెందిన డిస్ట్రిబ్యూటర్ తెలిపాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమాలు రాష్ట్రరాజకీయ నేపధ్యాలనడుమ వాయిదాపడ్డాయి.ఈ మబ్బులన్నీ త్వరగా తొలగిపోయి తెలుగు సినిమా అతి త్వరలో తిరిగి కళకళలాడాలని కోరుకుందాం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు