ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “బాహుబలి” ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమాకి కొత్త లెక్కలు పరిచయం చేసిన ఈ సినిమా విడుదల అయ్యి నేటితో దశాబ్ద కాలాన్ని చరిత్రలో పూర్తి చేసుకుంది.
అయితే ఈ స్పెషల్ డే నాడే మేకర్స్ సినిమా రీరిలీజ్ పై బిగ్ అప్డేట్ ఇస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు. మరి ఈ అప్డేట్ ని ఫైనల్ గా ఇచ్చేసారు. ఏకంగా తెలుగు, హింది, తమిళ్ అలాగే మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టుగా ఒక ఎపిక్ పోస్టర్ తో రివీల్ చేసేసారు.
మరి బాహుబలి సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి దీనితో ఆ డేట్ ని కూడా ఇచ్చేసారు. అన్నట్టు ఈ సినిమాని రెండు భాగాలు కలిపి ఒక కొత్త టైటిల్ తో “బాహుబలి – ది ఎపిక్” అంటూ ఈ అక్టోబర్ 31న భారీ స్థాయి విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. సో ఆ బిగ్ డే నాడు ఎలాంటి కొత్త రికార్డులకు నాంది పలుకుతుందో చూడాల్సిందే.