అక్కినేని నాగచైతన్య రీసెంట్‌గా ‘తండేల్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఆయన ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని విరూపాక్ష ఫేం దర్శకుడు కార్తీక్ దండుతో చేస్తున్నాడు. ఈ సినిమా మిస్టిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే, ఇప్పుడు చైతూ ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో ప్రాజెక్ట్‌ని ఓకే చేసే పనిలో ఉన్నాడు. తమిళ దర్శకుడు పిఎస్. మిత్రన్ డైరెక్షన్‌లో చైతూ ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య ఓ స్పై పాత్రలో నటిస్తాడనే టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మిత్రన్ ఇప్పటికే అభిమన్యుడు, సర్దార్ వంటి సినిమాలతో మంచి ఫేం తెచ్చుకున్నారు.
ఇక ఇప్పుడు మరోసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంతో నాగచైతన్యను స్పై గా మనకు చూపెట్టేందుకు ఆయన రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.