యూ’నాని’మాస్ ర్యాంపేజ్.. ‘హిట్ 3’ తో యూఎస్ లో భారీ ప్రీమియర్స్

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ భారీ చిత్రమే “హిట్ 3”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ అవైటెడ్ సస్పెన్స్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చిన ఈ చిత్రం నాని కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ అందుకునే దిశగా వచ్చింది. అయితే యూఎస్ మార్కెట్ లో నానికి ఉన్న క్రేజ్ తో ఇపుడు సాలిడ్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి అక్కడ దక్కాయి.

మరి ప్రీమియర్స్ వసూళ్లుగా అక్కడ లెక్క ఏకంగా 8 లక్షల డాలర్స్ మార్క్ ని అందుకుంది. ఇక డే 1 తో కలిపితే ఈజీగా 1 మిలియన్ మార్క్ ని హిట్ 3 కొట్టేస్తుంది అని చెప్పవచ్చు. దీనితో మొత్తానికి నాని యూనానిమస్ గా ర్యాంపేజ్ చూపిస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version