మన టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ కొణిదెల ఇటీవల పవన్ తో కలిసి పలు పుణ్య క్షేత్ర సందర్శనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ అకిరా అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేది లేదు అని అతనికి సంగీతం అంటే మక్కువ అని తెలిపారు. కానీ ఇపుడు పవర్ గాలి మాత్రం అకిరా డెబ్యూ ఇచ్చే దిశగా వీస్తుంది అని చెప్పక తప్పదు.
అకిరా లేటెస్ట్ లుక్స్ చూసి పవన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. అకిరా సరైన సినిమా పడాలి కానీ ఒక ఊహించి డెబ్యూగా ఇది నిలిచిపోయే రేంజ్ లో హైప్ ఇపుడు నడుస్తోంది. మరి అకిరా మనసులో ఏముందో కానీ పవన్ అభిమానులు మాత్రం తన ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే సినీ వర్గాల్లో కూడా అకిరా ఎంట్రీ ఉండొచ్చు అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.