ఓటీటీల కోసం సీనియర్ హీరో ప్లానింగ్ !

ఓటీటీల కోసం సీనియర్ హీరో ప్లానింగ్ !

Published on Sep 8, 2020 2:12 AM IST

హీరో డా. రాజశేఖర్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ సినిమా మంచి హిట్ అయింది. ఆ హిట్ తో సహజంగానే రాజశేఖర్ కి డిమాండ్ పెరిగింది. కానీ, తనకున్న డిమాండ్ ను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు రాజశేఖర్. కల్కి అంటూ తెలుగు ప్రేక్షుకులకు తన హీరోయిజాన్ని చూపించలేకపోయాడు. ఆ తరువాత కరోనా రాకతో రాజశేఖర్ సినిమాల ప్లానింగ్ మారిందట. రాజశేఖర్, ఇప్పుడు ఓటిటి ల కేసి చూస్తున్నాడు.

అసలు ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లో ఎంత వస్తోంది.. మన సినిమాకి వాళ్ళ దగ్గర ఎంత డిమాండ్ ఉంటుందో అంత బడ్జెట్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. రాజశేఖర్ ఒకప్పుడు హిట్లు ఉన్న హీరో. అందుకే ఇప్పటికి ఆయనకు డిమాండ్ ఉంది. రెండు, మూడు కోట్ల రేంజ్ లో సినిమా చేసి.. ఐదారు కోట్లకు ఈజీగా ఓటీటీలకు అమ్ముకోవచ్చు. మరి రాజశేఖర్ నుండి ఇలాంటి సినిమాలు ఎన్ని వస్తాయో చూడాలి. ఇక ప్రస్తుతం రాజశేఖర్ ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

తాజా వార్తలు