కెరీర్‌లో విరామం పై సీనియర్ బ్యూటీ క్రేజీ కామెంట్స్

సీనియర్ బ్యూటీ సోనాలి బింద్రేకి నేటికీ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆమెలోని గ్లామర్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సోనాలి బింద్రే తన సినీ కెరీర్ గురించి క్రేజీ కామెంట్స్ చేసింది.‘నేను మాతృత్వపు దశను పూర్తిగా ఆస్వాదించాను. ఓ సినిమా సీక్వెల్‌లో నటించే సమయంలో నేను ప్రెగ్నెంట్‌ అని తెలిసింది. అయినా విరామం తీసుకోలేదు. 8 నెలల పాటు రోజూ షూటింగ్‌కు వచ్చేదాన్ని. బిడ్డ కదలికలు తెలుస్తూ ఉండేవి. అయినా, నటిస్తూనే ఉన్నాను. నటన అంటే నాకు అంత ఇష్టం’ అంటూ సోనాలి బింద్రే చెప్పింది.

సోనాలి బింద్రే ఇంకా మాట్లాడుతూ.. ‘బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకున్నాను. అప్పటివరకూ నటిగా నా బాధ్యతలు ఎలా నిర్వర్తించానో, తల్లిగా కూడా నిర్వర్తించాలి కదా.. అందుకే విరామం తీసుకున్నాను. మాతృత్వాన్ని ఆస్వాదించాను. ఆ తర్వాత టీవీ షో ద్వారా ప్రేక్షకులను పలకరించాను. అయితే ఆ షో చేస్తున్నప్పుడే క్యాన్సర్‌ నిర్ధరణ అయింది. దీంతో కెరీర్‌కు మరోసారి బ్రేక్‌ పడింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యాను’ అంటూ సోనాలి బింద్రే చెప్పింది.

Exit mobile version