శేఖర్ పై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్

శేఖర్ పై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్

Published on Apr 9, 2013 11:10 AM IST

Allu-Arjun-and-Shekhar
ఎస్.ఆర్. శేఖర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ ఎడిటర్ గా పేరు తెచ్చుకున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో మంచి సాన్నిహిత్యం ఉంది, అలాగే వీరిద్దరి కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘బిజినెస్ మేన్’ కి ఎస్.ఆర్. శేఖర్ చేసిన ఎడిటింగ్ కి మంచి పేరు వచ్చింది. అలాగే మహేష్ బాబు నుండి స్వయంగా ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మరొక పాపులర్ హీరో కూడా ఈయన వర్క్ కి ఇంప్రెస్ అయ్యాడు. ప్రస్తుతం ఎస్.ఆర్. శేఖర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నాడు. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి అల్లు అర్జున్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ‘ మా అల్లు అర్జున్ ఎంతో సంతోషంగా ట్రైలర్ చాలా బాగుంది, సింప్లీ సూపర్బ్’ అని అన్నాడని ఎస్.ఆర్. శేఖర్ ట్వీట్ చేశాడు.

ఇండస్ట్రీలో ఎడిటర్ రోల్ ని చాలా తక్కువగా అంచనా వేస్తారు. కానీ ఎవరికైతే వారి విలువ తెలుస్తుందో వారు ఖచ్చితంగా వారి టాలెంట్ ని ప్రశంసిస్తారు. ఫ్యూచర్ లో శేఖర్ ఎలాంటి ఉన్నత స్థానాలకు వెల్తాడో వేచి చూడాలి.

తాజా వార్తలు