లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రానికి కత్తిరింపు

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రానికి కత్తిరింపు

Published on Sep 18, 2012 11:33 AM IST


సున్నితమయిన చిత్రాలను చేసే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రం శుక్రవారం విడుదల అయ్యింది. ఈ చిత్రం ప్రేక్షకుల దగ్గ్గర నుండి మిశ్రమ స్పందన అందుకుంది. ఏ సెంటర్స్ మరియు ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబట్టుతుండగా బి మరియు సి సెంటర్లలో కలెక్షన్లు నిరశపరుస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రధాన లోపం ఈ చిత్ర నిడివి ఎక్కువగా ఉండటం అని అన్నారు. శేఖర్ కమ్ముల ఈ స్పందన విన్న తరువాత చిత్రంలో దాదాపుగా 20 నిమిషాల చిత్రాన్ని కత్తిరించినట్టు తెలుస్తుంది. ఇది చిత్ర ఫలితం మీద బాగా ప్రభావం చూపనుంది. చిత్రానికి అవసరం లేని సన్నివేశాలను కత్తిరించడం మూలాన చిత్రం చూశాక కలిగే భావనలో మార్పు వస్తుంది. ఈ కత్తిరించిన వెర్షన్ త్వరలో ప్రదర్శించబడుతుంది. శేఖర్ స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమల అక్కినేని,శ్రియ మరియు అంజలా జవేరి లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందించారు.

తాజా వార్తలు