కహాని రీమేక్ చేయనున్న శేకర్ కమ్ముల

కహాని రీమేక్ చేయనున్న శేకర్ కమ్ముల

Published on Dec 19, 2012 1:33 PM IST

sekhar-kammula-kahaani
2012లో విడుదలై బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అయిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘కహాని’. ఈ సినిమా త్వరలోనే తెలుగు తమిళ భాషల్లో నిర్మించాలనుకుంటున్నారు. ఈ సినిమాని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం శేకర్ కమ్ముల ఈ సినిమా రీమేక్ రైట్స్ కి సంబందించిన విశేషాలను పూర్తి చేయడానికి ముంబైలో ఉన్నారు. ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్న ఈ సినిమాని ఎందేమోల్ ఇండియా బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

ఈ థ్రిల్లర్ సినిమా హైదరాబాద్ నేపధ్యంలో తీయనున్నారు, ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. హిందీ వెర్షన్ ‘కహాని’ లో చేసిన విద్యాబాలన్ పాత్రని ఇక్కడ ఎవరు చేయనున్నారు అనేది ఇంకా తెలియలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు