లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్ గురించి మాట్లాడిన శేఖర్ కమ్ముల

లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్ గురించి మాట్లాడిన శేఖర్ కమ్ముల

Published on Jul 7, 2012 10:19 AM IST


ఎట్టకేలకు శేఖర్ కమ్ముల తన రాబోతున్న చిత్రం “లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్” ఆలస్యం కావడం గురించి మాట్లాడారు. ఈ ఏడాది మొదటిలోనే ఈ చిత్రం విడుదల కావలసి ఉంది కొన్ని తెలియని కారణాల మూలాన వాయిదా పడింది. ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “ఈ చిత్రం ఆరుగురు సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిలు, అబ్బాయిల మధ్య నడిచే కథ. ఈ చిత్రం కాస్త “హ్యాపీ డేస్” పోలికలున్న కాలేని కథలా ఉంటుంది” అని అన్నారు.ఈ చిత్రం ఎందుకు ఆలస్యమయ్యింది అనే విషయం గురించి మాట్లాడుతూ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఈ చిత్రంలో కాలేని సెట్ మొత్తాన్ని మళ్ళి వేశారు. అభిజీత్, సుధాకర్, కౌశిక్, జరా, రష్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్ మరియు శ్రీరామ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా విజయ్ సి కుమార్ ఈ చిత్రానికి చాయగ్రహణం అందిస్తున్నారు ఈ చిత్ర చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది ప్రస్తుతం నిర్మాణాంతర దశలో ఉంది.

తాజా వార్తలు