డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా పాటలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అందాల రాక్షసి ఫేం శ్రవణ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. సున్నితమైన సినిమాలను తీసే శేఖర్ కమ్ముల ఈ పాటలను విని ఈ చిత్ర టీం ని అభినందించారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘ ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలోని పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. ముఖ్యంగా సమ్మతమే సమ్మతమే పాట చాలా బాగుంది. అలాగే ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా హిట్ అవ్వాలని ఈ చిత్ర టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని’ అన్నాడు.
హర్షవర్ధన్ రాణే, విష్ణు వర్ధన్, హరీష్ వర్మ, రీతు వర్మ, వితిక, శ్రీ ముఖి ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా ద్వారా పవన్ సదినేని డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. డి. సురేష్ బాబు సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ పై వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మించారు. నారా రోహిత్ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.