మన టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల చిత్రాలు అంటే ఎప్పుడూ ఒక ఫ్రెష్ ఫీల్ ను ఇస్తాయి. అందుకే కాస్త ఎక్కువ సమయం పట్టినా సరే విడుదల సమయానికి మాత్రం శేఖర్ కమ్ముల చిత్రాలకు మంచి హైప్ వచ్చేస్తుంది. తన చివరి చిత్రం “ఫిదా” నుంచి ఇప్పుడు వస్తున్న “లవ్ స్టోరీ” చిత్రానికి కూడా అలానే చాలా గ్యాప్ వచ్చేసింది. పైగా మధ్యలో లాక్ డౌన్ కూడా ఎదురు కావడంతో మరింత ఆలస్యం కావాల్సి వచ్చింది.
అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య మరియు సాయి పల్లవిల కాంబోలో వస్తున్న ఈ చిత్రం కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం మళ్ళీ పునః ప్రారంభం కానుంది. అందుకు దర్శకుడు శేఖర్ కమ్ముల ఊహించని ప్లాన్స్ వేస్తున్నారట. ఇప్పటికే అనేక చిత్రాలు షూటింగ్స్ అంతా అతి తక్కువ మంది క్రూ తో చేస్తున్నారు.
వారే తక్కువ అనుకుంటే శేఖర్ కమ్ముల మాత్రం ఈ చిత్రానికి కేవలం 15 మంది సిబ్బంది తోనే చెయ్యడానికి ప్లాన్ చేశారట. అలాగే వారందరు మళ్ళీ కొన్ని రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో వచ్చే సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభించనున్నారు.