‘ఎవడు’ సినిమాలో విదేశీ భామతో ప్రత్యేక గీతం

‘ఎవడు’ సినిమాలో విదేశీ భామతో ప్రత్యేక గీతం

Published on May 26, 2012 9:29 AM IST


ఎరినా, మరియం జకారియా మరియు గాబ్రిలా బెర్టంటే వంటి విదేశీ మోడల్స్ తరువాత మరో విదేశీ భామ తెలుగు సినిమాలో ఐటెం గర్ల్ గా రాబోతుంది. దిబాకర్ బెనర్జీ రూపొందిస్తున్న ‘షాంఘై’ సినిమాలో ప్రత్యేక గీతంలో ఐటెం గర్ల్ గా కనిపించిన స్కార్లెట్ విల్సన్ అనే విదేశీ మోడల్ మన తెలుగు సినిమాలో ఐటెం గర్ల్ గా కనిపించనుంది. వంశి పైడిపల్లి డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమాలో స్కార్లెట్ ఐటెం గర్ల్ గా కనిపించబోతుంది. బిజినెస్ మేన్ సినిమాలో ‘బాడ్ బోయ్స్’ పాటలో నర్తించిన శ్వేతా భరద్వాజ్ ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఈ చిత్ర బృదం నుండి సమాచారం ప్రకారం స్కార్లెట్ ఈ పాటలో నర్తించినట్లు ధ్రువీకరించారు. ఇటీవలే ఈ పాటని హైదరబాదులో చిత్రీకరించారు. రామ్ చరణ్ సరసన సమంతా మరియు ఏమీ జాక్సన్ నటిస్తుండగా అల్లు అర్జున్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు