అక్టోబర్ 25న విడుదలకానున్న సత్య 2

satya-2

క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన తదుపరి ప్రాజెక్ట్ ‘సత్య 2’ సినిమాను 25 అక్టోబర్ న తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషలలో విడుదలచెయ్యనున్నాదు. తెలుగు వెర్షన్ ఆడియో ఇటీవలే విడుదలైంది

తెలుగు వెర్షన్ లో శర్వానంద్ హీరోగా కనిపిస్తుండగా, మూడు భాషలలో అనైకా హీరోయిన్ గా పరిచయంకానుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్.జి.వి స్కూల్ లో వుంటూ అతనకు ఎక్కువ సినిమాలకు సంగీతం అందించిన అమర్ మొహలె స్వరాలు సమకూర్చాడు. తెలుగు వెర్షన్ ను సుమంత్ కుమార్ రెడ్డి నిర్మించాడు

ఈలోపు ఈ సినిమా వెనుక వున్న నిజాలను ఆర్.జి.వి ఈ నెల 30న ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించానున్నాడు. మరిన్ని వివరాలకోసం మా సైట్ ను చదువుతూవుండండి

Exit mobile version