మహేష్ సరిలేరు నీకెవ్వరు వసూళ్ల పరంపర కొనసాగుతుంది. మొదటి రోజు 5.15కోట్ల షేర్ వసూళ్లతో నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆదివారం తో పాటు నిన్న వర్కింగ్ డే సోమవారం కూడా మంచి వసూళ్లను రాబట్టింది. సోమవారం ఈ మూవీ 45.92 లక్షల షేర్ సాధించి అబ్బురపరిచింది. ఇక నేటి నుండి పండుగ దినాలు మొదలుకావడంతో వసూళ్ళలో పెరుగుదల నమోదయ్యే ఆస్కారం కలదు.
అలాగే ఓవర్సీస్ కూడా సరిలేరు నీకెవ్వరు $2మిలియన్ డాలర్స్ వసూళ్లకు చేరువైంది. టూ మిలియన్ క్లబ్ లో చేరిన మహేష్ మూడవ సినిమాగా సరిలేరు నీకెవ్వరు నిలవనుంది. సరిలేరు నీకెవ్వరు మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా, విజయశాంతి కీలక రోల్ చేశారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. అని రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందించారు.