చీరలోనే అందం ఉంది – సమంత

చీరలోనే అందం ఉంది – సమంత

Published on Feb 4, 2012 11:01 AM IST


అందంగా కనిపించడానికి మరియు సంప్రదాయంగా కనిపించడానికి చీరలో కనిపించడమే ఉత్తమం అని సమంత అన్నారు. ఒకానొక మార్ట్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఈ నటి మాట్లాడుతూ “సంప్రదాయానికి దగ్గర చేసేది చీరలే ఎప్పుడు చీరలే కట్టుకోవాలని ఉంటుంది” అని అన్నారు.ఈ సంవత్సరం మొత్తం నాలుగు భాషల్లో 8 చిత్రాలలో సమంత కనిపించబోతుంది. “గౌరవం” మరియు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రాలలో తన పాత్ర అద్బుతంగా ఉండబోతుందని సమంత చెప్పారు. “నా దగ్గరకి వస్తున్న ప్రతి మంచి అవకాశాన్ని అందుకోవాలని చూస్తున్న” అని సమంత పేర్కొన్నారు.

తాజా వార్తలు