టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో ప్రియదర్శి, రూప కొడువాయుర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్గా కట్ చేశారు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, హర్ష చేసే కామెడీతో ఈ ట్రైలర్ పూర్తి ఫన్ రైడ్‌గా సాగింది. జాతకాన్ని నమ్మే హీరోకి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి.. అతడి ప్రేమకు ఎలాంటి సమస్య ఎదురైంది.. వాటన్నింటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, హర్షలతో కలిసి ప్రియదర్శి చేసే కామెడీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించగా భారీ క్యాస్టింగ్ ఇందులో నటిస్తుంది. శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి