వాడే నిజమైన మగాడు అంటున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్.

వాడే నిజమైన మగాడు అంటున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్.

Published on Apr 19, 2020 3:49 PM IST

సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా ద్వారా ఓ ఆసక్తికర సందేశంతో కూడిన వీడియో పంచుకున్నారు. ఆ వీడియోలో ఆయన ఇంటి పనులు చేస్తూ కనిపించారు. కట్టుకున్న భార్యను భర్త కష్టపెట్టకుండా చూసుకోవాలనే సందేశం ఇచ్చారు. ”మగాళ్లు శ్రామిక జీవులు కావచ్చు, ఐతే ఇంటి పనులు మొత్తం భార్యలపై వదిలేసే వాళ్ళు నిజమైన మగాళ్లు అనిపించుకోరు.. ముఖ్యంగా పనిమనిషి కూడా అందుబాటులో లేని ఇలాంటి సమయాలలో వారికి సహాయంగా ఉందాము. రాజమౌళి గారు ఈ వీడియో చాలా మందికి పాస్ చేయడంతో పాటు, మీరు కూడా ఓ వీడియో చేసి ఎక్కువ మందిలో స్ఫూర్తి నింపుతారని కోరుకుంటున్నాను” అని ట్విట్టర్ లో సందేశం పెట్టారు.

మరి రాజమౌళి సందీప్ రెడ్డి అభ్యర్ధనకు ఎలా స్పందిస్తారో చూడాలి. ఐతే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి మూవీపై మహిళలు అప్పట్లో మండిపడ్డారు. హీరో చేత హీరోయిన్ ని చెంప దెబ్బలు కొట్టించాడని తప్పుబట్టారు. దీనితో సందీప్ రెడ్డి ప్రస్తుత వీడియో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో మూవీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు