హీరో సందీప్ కిషన్ కెరీర్ బిగినింగ్ నుండి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ఏవన్ ఎక్స్ ప్రెస్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం సందీప్ సిక్స్ ప్యాక్ సిద్ధం చేశారు. స్పోర్ట్స్ మెన్ లుక్ కోసం ఆయన కస్టపడి బరువుతగ్గాడు. సిక్స్ ప్యాక్ బాడీ లో సందీప్ లేటెస్ట్ లుక్ కేక పుట్టించేలా ఉంది.
తెలుగులో హాకీ పై వస్తున్న ఫస్ట్ మూవీ ఏ వన్ ఎక్ష్ప్రెస్స్ కావడం విశేషం. దర్శకుడు డెన్నిస్ జీవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి సందీప్ కిషన్ కి జంటగా నటిస్తుంది. వీటితో పాటు నరగసూరన్, కసడతపర అనే రెండు తమిళ చిత్రాలలో సందీప్ కిషన్ కీలక రోల్స్ చేశారు.