యంగ్ హీరో నాని మొదటి సారి ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్న చిత్రం ‘జెండాపై కపిరాజు’. సముద్ర ఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి సముద్రఖని మాట్లాడుతూ ‘ మీరు దేశానికి ఏం చెయ్యొద్దు, కనీసం మీ సొంత ఊరికి కూడా ఏం చెయ్యొద్దు, మీ పనులన్నీ మానేసుకొని పక్కవారికి సేవ కూడా చెయ్యొద్దు.. చ్తనైథె మొదట నీకు నువ్వు బాగుపడు.. చాలు.. నువ్వు బాగుపడితే దేశం దానంతట అదే బాగుపడుతుంది. ఇదే అంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.నాని రెండు పాత్రల్లోనూ మంచి నటనని కనబరిచారని’ అన్నాడు.
అమలాపాల్, రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో శరత్ కుమార్, శివ బాలాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.