హీరో సంపూర్ణేష్ బాబుపై దాడి

హీరో సంపూర్ణేష్ బాబుపై దాడి

Published on Apr 7, 2014 6:46 AM IST

sampoo
‘హృదయ కాలేయం’ సినిమా హీరో సంపూర్ణేష్ బాబు, ఆ సినిమా దర్శకుడు స్టీవెన్ శంకర్ లపై దాడి జరిగింది. ఈ దాడిలో వీరిద్దరికి గాయాలయ్యాయని సమాచారం. గాయపడిన వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ హోటల్ లో ఓ గ్రూప్ కు దర్శకుడికి వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఆ గొడవలో దర్శకుడు స్టివెన్ శంకర్ పై, అక్కడే ఉన్న సంపూ్ణేష్ బాబుపై కూడా మనోజ్ అనే వ్యక్తితోపాటు ఇతర వ్యక్తులు కూడా దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడిలో స్టీవెన్ శంకర్ కు గాయాలైనట్టు తెలిసింది. దాడికి పాల్పడిన నిందితుడు మనోజ్ ను పోలీసుల అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

ఇక, గత శుక్రవారం విడుదలైన ‘హృదయ కాలేయం’ సినిమా మంచి పబ్లిసిటీ సొంతం చేసుకుని థియేటర్లలో సందడి చేస్తోంది.

తాజా వార్తలు