రచ్చ షూటింగ్ నిలిపివేసిన సంపత్ నంది

రచ్చ షూటింగ్ నిలిపివేసిన సంపత్ నంది

Published on Feb 4, 2012 6:12 PM IST


రామ్ చరణ్ తేజ్, తమన్నా నటిస్తున్న చిత్రం “రచ్చ” ప్రస్తుతం పెరియార్ టైగర్ రిజర్వు కేరళ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఒక ప్రేమ గీతాన్ని ఇక్కడ చిత్రీకరిస్తున్నారు . ఇక్కడ రిజర్వు డిప్యూటి డైరెక్టర్ తో ఈ చిత్ర బృందం సమస్య ఎదుర్కొంది. ఈయన భద్రత లేనిదే లోపలికి వెళ్ళకూడదు అని చెప్పగా ప్రేమ పాటలో ఇలాంటివి సరిపోదు అని దర్శకుడు అడిగారు. బొట్ లో చిత్రీకరణ జరుగుతున్న ఈ పాటకి లైఫ్ జాకెట్స్ వేసుకోమని డిప్యూటి డైరెక్టర్ అడిగారు ఇలా ఇద్దరు ఒకరి నిర్ణయానికి ఇంకొకరు ఒప్పుకోకపోవటంతో సంపత్ నంది ఈ రోజు చిత్రీకరణ నిలిపి వేశారు. పరాస్ జైన్ మరియు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజా వార్తలు