సమీరా రెడ్డి కి పెళ్ళైపోయింది!!!!

సమీరా రెడ్డి కి పెళ్ళైపోయింది!!!!

Published on Jan 22, 2014 12:04 AM IST

sameera-reddy
నటి సమీరారెడ్డికి అక్షయ్ వర్ధేతో వివాహం అయ్యింది. ఆమె రెండేళ్ళగా అతడితో డేటింగ్ లో వుంది. ఇటీవలే ముంబైలో నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట వివాహాన్ని గోప్యంగా జరుపుకున్నారు. అక్షయ్ వర్ధే వ్యాపారవేత్త మరియు వార్ధెంచి మోటర్ సైకిల్స్ కి కో ఓనర్

కొన్ని వారాలముందు సమీరా రెడ్డి బాలకృష్ణ నటిస్తున్న లెజెండ్ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో నటిస్తుందని పుకార్లు వచ్చాయి. ఈ వార్తను సినిమా బృందం అధికారికంగా వెల్లడించలేదు. ఈ భామ 2012లో అశోక్, నరసింహుడు, జై చిరంజీవ సినిమాలలో హీరొయిన్ గా నటించింది. ఇటీవలే రానా నటించిన కృష్ణంవందేజగద్గురుం సినిమాలో ఐటెం సాంగ్ లో చిందేసింది. తన కెరీర్ లో ఇప్పటివరకూ సూర్య s/o కిషన్ సినిమాలో సూర్య సరసన నటించిన పాత్ర హై లైట్ అని చెప్పచ్చు

సమీరా రెడ్డి నిశ్చితార్ధం విషయం తప్ప మీడియాకు మరే వార్తా చెప్పలేదు. మరి ఈ పెళ్ళి శుభవార్త ఎప్పుడు చెప్తుందో చూద్దాం

తాజా వార్తలు