అనాధ పిల్లలకు వైద్యసదుపాయాలు కల్పించనున్న సమంతా

అనాధ పిల్లలకు వైద్యసదుపాయాలు కల్పించనున్న సమంతా

Published on Apr 8, 2014 4:19 AM IST

samantha
ప్రత్యూష అనే సంస్థ ద్వారా సమంతా సామాజిక సేవ చేస్తున్న విషయం తెలిసినదే. తన సంస్థ ద్వారా విరాళాలు సేకరించి దానాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సంస్థను పెద్ద తరహా రీతిలో తీసుకెళ్ళే యోచనలో వుంది ప్రత్యూష ఫౌండేషన్ లైవ్ లైఫ్ హాస్పిటల్స్ తో చేయికలిపింది. ఈ హాస్పిటల్ అనాధశరణాలయంలో ఉండే పిల్లలకు ఉచిత వైద్య సదుపాయాలను కల్పిస్తుంది. వీటిలో శారీర, పళ్ళు, రక్తపు మరియు మానసిక సమస్యలకు చెక్ అప్ వుండనుంది. ఈ హాస్పిటల్ తో తరచూ సమంతా బృందం టచ్ లో వుండనుందని తెలిపింది

ఈ భామ ప్రస్తుతం ఎన్.టీ.ఆర్ రభస, సూర్య సరసన అంజాన్ మరియు వి,వి వినాయక్ ల సినిమాలలో బిజీగా వుంది

తాజా వార్తలు