‘రామ్ అండ్ జూలియట్’ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్న సమంత

Samantha
ప్రముఖ రచయత కోన వెంకట్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు ఇటివలే కోన వెంకట్ దర్శకుడు కాబోతున్నాడు అని ప్రకటించాము. ఈయన మొదటి చిత్రం ‘రామ్ అండ్ జూలియట్’ వేసవి లో విడుదల కు సిద్ధం కాగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చెయ్యడం మొదలుపెట్టారు .

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి లుక్ ని సమంత ఫిబ్రవరి 14 న విడుదల చెయ్యనుంది. ఈ రొమాంటిక్ డ్రామా ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యడానికి సమంతను మించిన సెలిబ్రిటీ లేరు. అని కోన వెంకట్ తన ట్విట్టర్ పేజి లో పేర్కొన్నారు. రొమాంటిక్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనేర్ అయిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం న్యూ యార్క్ లో జరిగింది.

అక్షయ్ రెడ్డి, ఆరోరే ఫగెన్, అనోఖ్ ఎట్టబోయిన, నితిన్ మూర్తిరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు మరియు సన్నీ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వంశీ మదిరాజు మరియు రామ్ గోలి నిర్మించారు.

Exit mobile version