బంగారు కోడిపెట్ట టీంతో సందడి చేయనున్న సమంత

బంగారు కోడిపెట్ట టీంతో సందడి చేయనున్న సమంత

Published on Jul 3, 2013 12:57 PM IST

Samantha_Prabhu
నవదీప్ హీరోగా, స్వాతి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘బంగారు కోడిపెట్ట’. ఈ సినిమా ఆడియోని రేపు హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్ లో లాంచ్ చేయనున్నారు. రాజ్ పిప్పల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని గురు ఫిలింస్ బ్యానర్ పై సునీత తాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో లాంచ్ కి నిర్వాహకులు సమంతని ఆహ్వానించడం జరిగింది. దీనికి సమంత కూడా అంగీకరించింది. గత కొద్ది రోజులుగా సమంత కొన్ని సినిమా ఫంక్షన్ లకు హాజరవుతోంది. మరోసారి సమంత మరొకరు నటించిన ఆడియో ఫంక్షన్ కి రానుంది. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ – లక్ష్మన్ లు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి మహేష్ శంకర్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ కార్యకమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలో విడుదలయ్యె అవకాశం ఉంది.

తాజా వార్తలు