సమంతని ఆనందంలో ముంచెత్తిన సీతమ్మ వాకిట్లో…. స్పందన

సమంతని ఆనందంలో ముంచెత్తిన సీతమ్మ వాకిట్లో…. స్పందన

Published on Jan 11, 2013 2:30 PM IST

samantha
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి వస్తున్న స్పందనతో సమంత ఆనందంలో మునిగి తేలుతుంది.“ఈ చిత్రంలో నేను ఒక భాగం అయినందుకు చాలా గర్వంగా ఉంది.వెంకటేష్ గారు మరియు మహేష్ బాబు ఇటువంటి రిస్క్ తీసుకొని చేసినందుకు వాళ్లకి హాట్సాఫ్. వీరిద్దరూ కలిసి చేసిన చిత్రం ఈ ఏడాది మొదటి చిత్రం కావడం నా అదృష్టం” అని సమంత అన్నారు. “దూకుడు” చిత్రం తరువాత మహేష్ బాబు సరసన సమంత ఈ చిత్రంలో కనిపించింది. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మధ్యనే సమంత “జబర్దస్త్” చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో ఈ భామ ఎన్టీఆర్-హరీష్ శంకర్ మరియు త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటుంది.

తాజా వార్తలు