తన చారిటీ కోసం కొత్త ప్లాన్ వేసిన సమంత

తన చారిటీ కోసం కొత్త ప్లాన్ వేసిన సమంత

Published on Aug 8, 2013 12:00 PM IST

Samantha_Prabhu

సమాజానికి ఏదన్నా మంచి చేయాలనుకుని సోషల్ వెల్ఫేర్ సంస్థల ద్వారా సాయం అందించే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. ఆమె ప్రారంభించిన ఓ చారిటీ కోసం తన ఫాన్స్ కి సపోర్ట్ చేయడానికి, సహాయం చేయడానికి ఆమె కృషి చేస్తోంది. అలాగే ప్రస్తుతం చారిటీని మరో లెవల్ కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది. సమంత ‘ప్రత్యూష’ అనే పేరుతో ఒక చారిటేబుల్ సంస్థని స్టార్ట్ చేసింది. ఈ సంస్థ ద్వారా ఆడవారికి, పిల్లలు సహాయం చేస్తోంది. సమంత ప్రస్తుతం చారిటి కోసం తను సినిమాల్లో వేసుకున్న డ్రెస్ లను, తను ఉపయోగించిన కాస్ట్యూమ్స్ ని వేలం వేయడానికి ప్లాన్ చేస్తోంది.

‘నేను ఆడియో విడుదలకు, అవార్డు ఫంక్షన్స్ కి, నేను నటించిన సినిమాల్లో వేసుకున్న దుస్తులను వేలం వెయ్యాలని ప్లాన్ చేస్తున్నాను. దీనికి సంబందించిన వివరాలను త్వరలో తెలియజేస్తాను. ‘ప్రత్యూష’ ఒక చారిటి సంస్థ. ముఖ్యంగా ఆంద్ర ప్రదేశ్ లోని పిల్లలు, ఆడవారి కోసం స్థాపించడం జరిగిందని’ సమంత ట్వీట్ చేసింది. సమంత టాప్ హీరోల వస్తువులను కూడా ఈ వేలంలో ఉంచుతానని ప్రామిస్ చేసింది. ‘ కొంతమంది మీ ఫేవరేట్ స్టార్ హీరోల వస్తువులను కూడా ఈ వేలంలో ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. మీ ఫేవరేట్ స్టార్ ల వస్తువులు ఇవ్వమని అడుగుతాను. లేదంటే కొన్నైన దొంగిలిస్తాను… ప్రామిస్..’ అని మరో ట్వీట్ చేసింది.

తాజా వార్తలు