ఇటీవల కాలంలో సమంత కొలీవుడ్ లో న్యూస్ మేకర్ గా మారింది. సూర్య – లింగుస్వామి దర్శకత్వంలో అంజాన్ సినిమాలో నటించిన ఈ భామ ఇప్పుడు విజయ్ మురుగదోస్ సినిమాలో నటించడానికి సిద్ధపడుతుంది
ఈ సినిమా ఈ నెల మొదట్లో కలకత్తాలో మొదలై ఇప్పుడు చెన్నైకు షిఫ్ట్ అయ్యింది. రేపట్నుంచి ఈ సినిమాలో జాయిన్ అవ్వనున్న సమంత అక్కడ ఎయిర్ పోర్ట్ లోనే కొన్ని సన్నివేశాలలో నటించనుంది. సమాచారం ప్రకారం ఈ సినిమా త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు
సూర్యతో నటిస్తున్న సినిమాలో ఇటీవలే మహారాష్ట్రలో ప్రముఖ సందర్శనా కేంద్రమైన పంచ్ గని లో ఒక పాట చిత్రీకరణ జరుపుకుంది. త్వరలో ఆమె నటించిన ఆటోనగర్ సూర్య, మనం సినిమాలు విడుదలకానున్నాయి