తన బలహీనత గురించి చెప్పిన సమంత

samantha
ఈ మధ్య అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత తన బలహీనత గురించి చెప్పుకొచ్చింది. తనకి వంట చేయడం రాదని, ఈ సెలవుల్లో వంట చేయడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పుకొచ్చింది. షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల హీరోయిన్లకి ఇంట్లో వాళ్ళతో గడపడం కుదరదు కదా ఈ సెలవుల్లో సమంత ఇంట్లోవాళ్ళతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. చేసిన మొదటి నాలుగు సినిమాలు హిట్ కావడంతో లక్కీ గర్ల్ అని పేరు తెచ్చుకున్న సమంత నటించిన 5 సినిమాలకు పైగా విడుదల కానున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇప్పటికే విడుదల కాగా, జబర్ధస్త్, ఆటో నగర్ సూర్య వేసవి వరకు కానున్నాయి. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమా, ఎన్టీఆర్ – హరీష్ శంకర్ సినిమాలో కూడా ఈ సంవత్సరమే విడుదలవుతాయి.

Exit mobile version