రామయ్యా వస్తావయ్యా షూటింగ్లో పాల్గున్న సమంత

రామయ్యా వస్తావయ్యా షూటింగ్లో పాల్గున్న సమంత

Published on Jul 16, 2013 4:00 AM IST

Samantha
సమంత ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో చాలాకాలం విరామం తరువాత తిరిగి పాల్గుంటుంది. ఇటీవలే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాన్ సరసన షూటింగ్ పూర్తిచేసుకుంది. వెంటనే హైదరాబాద్లో జరుగుతున్న ‘రామయ్యా వస్తావయ్యా’ షూటింగ్ కు హాజరయ్యింది. ప్రస్తుతం సమంత పైన కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ హైదరాబాద్లో మరికొన్ని రోజులు సాగచ్చు. ఎన్.టీ.ఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమా ఆడియో విడుదల ఆగష్టు రెండో వారంలో వుంటుందని దర్శకుడు తెలిపాడు. ఈ మాస్ ఎంటర్టైనర్లో ఎన్.టీ.ఆర్ సరసన సమంత, శృతి హాసన్ నటిస్తున్నారు. దిల్ రాజ్ నిర్మాత. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా సెప్టెంబర్లో మన ముందుకురానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు