పవన్ మూవీ కోసం స్విట్జర్ ల్యాండ్ వెళ్లనున్న సమంత

పవన్ మూవీ కోసం స్విట్జర్ ల్యాండ్ వెళ్లనున్న సమంత

Published on Jun 18, 2013 4:06 PM IST

samantha_latest_hot_stills_
అందాల భామ సమంత ప్రస్తుతం తన సినిమా షెడ్యూల్స్ తో బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్న ఈ భామ అందరికీ డేట్స్ ని అటు సర్ది ఇటు సర్ది సమానంగా ఇచ్చి అందరికీ న్యాయం చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం సమంత ఈ రోజు రాత్రి స్విట్జర్ ల్యాండ్ కి బయలుదేరనుంది. ఈ సినిమాకి ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ – సమంత కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రానున్న వారాల్లో ఈ చిత్ర యూనిట్ యూరప్ లో ఈ సినిమాని సంబందించిన కొన్ని పాటలను, కొన్ని సీన్స్ ని తెరకెక్కించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగష్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.

తాజా వార్తలు