పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ఖరారు చేసిన సమంత

పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ఖరారు చేసిన సమంత

Published on May 15, 2013 5:10 PM IST

samantha_latest_hot_stills_

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ విషయంలో పలు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్ ఎక్కువగా వినిపిస్తోంది కానీ అధికారికంగా ఖరారు చేయలేదు. ఈ రోజు సమంత వేసిన ఓ ట్వీట్ ఈ విషయానికి తెరదించేసింది.

‘ప్రస్తుతం ‘రామయ్యా వస్తావయ్యా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలు చేస్తున్నాను. వచ్చే నెల నుంచి అక్కినేని కుటుంబం అంతా కలిసి చేయనున్న ‘మనం’ సినిమా, ఎన్.టి.ఆర్ తో చేసే ‘రభస’ సినిమాలు మొదలవుతాయని’ సమంత ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ ఇన్ని రోజులుగా టైటిల్ పై వస్తున్న పుకార్లకు తెరదించింది. ఫుల్ కామెడీతో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా స్టొరీ లైన్ ప్రకారం పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ఈ టైటిల్ ఎంచుకొని ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాకి నిర్మాత.

తాజా వార్తలు