యంగ్ హీరో నితిన్, అందాల భామ సమంత కలిసి హైదరాబాద్ నిజాం పేటలో సరికొత్త ఏషియన్ గ్రూప్ మల్టీప్లెక్స్ ని లాంచ్ చేసారు. ఈ కార్యక్రమానికి మరికొంతమంది అతిధులు కూడా హాజరయ్యారు.
మొట్ట 3 స్క్రీన్స్ ఉన్న ఈ మల్టీప్లెక్స్ లో టికెట్ ధర 125 రూపాయలు. గత ఒక సంవత్సరంగా రెడీ అవుతున్న దీనికి ఎట్టకేలకు క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చింది. రేపు విడుదల కానున్న ‘రేసు గుర్రం’ సినిమాతో ఈ మల్టీ ప్లెక్స్ ప్రారంభం కానుంది.
ఇది కాకుండా మరి కొన్ని మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్స్ కూడా హైదరాబాద్ లో రానున్నాయి.